రావూరి సాహిత్యం సమాజానికి అద్దం: మధుసూదన్ రావు
విశ్వంభర, చిక్కడపల్లి : పెద్ద చదువులు చదవకపోయినా సామాన్య స్థాయి నుంచి సాహితీ సృజనతో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మహోన్నతుడు రావూరి భరద్వాజ అని దూరదర్శన్ పూర్వ సంచాలకుడు డాక్టర్ పి. మధుసూదన్ రావు అన్నారు. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని లలిత కళా వేదికపై జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని రచయిత పరవస్తు లోకేశ్వర్‌కు, రావూరి కాంతమ్మ స్మారక సేవా పురస్కారాన్ని గాయని హారిప్రియకు ప్రదానం చేశారు. లోకేశ్వర్‌కు రూ.10 వేల నగదు, హారిప్రియకు రూ.5 వేల నగదు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. డాక్టర్ పి. మధుసూదన్ రావు మాట్లాడుతూ రావూరి భరద్వాజ రచనలు సమాజ వాస్తవాలను ప్రతిబింబించాయని, ముఖ్యంగా 'పాకుడురాళ్లు' నవల తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన బైస దేవదాసు మాట్లాడుతూ పరవస్తు లోకేశ్వర్ యాత్రా సాహిత్యంలో విశిష్ట కృషి చేశారని, హారిప్రియ శాస్త్రీయ సంగీతంలో గుర్తింపు పొందారని అభినందించారు. రచయిత్రి రాజ్యశ్రీ, పొత్తూరి సుబ్బారావు రావూరి భరద్వాజ సాహిత్య విశిష్టతను వివరించారు. కోటేశ్వరరావు నివేదిక సమర్పించగా, రాఘవరెడ్డి స్వాగతం పలికారు. పెద్దూరి వెంకటదాసు సభను నిర్వహించారు. ప్రారంభంలో కోమల శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో: రావూరి కోటేశ్వరరావు రచయిత్రి రాజ్యశ్రీ సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు సంస్థ కార్యదర్శి రాఘవరెడ్డి కవి పెద్దూరి వెంకటదాసు పాల్గొన్నారు.