నూతన విప్ ఛాంబర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వీరేశం

విశ్వంభర, రామన్నపేట: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలోని నూతన "విప్ ఛాంబర్"ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం.నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు హాజరై వేముల వీరేశం కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వీరేశంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సేవలో మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-whip-veeresham-inaugurated-the-new-whip-chamber/article-18132

Tags: