గిరిజన దర్బార్‌లో వినతుల స్వీకరణ.. త్వరితగతిన  పరిష్కారానికి ఆదేశం

విశ్వంభర, భద్రాచలం: గిరిజనుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనుల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన దర్బార్ కేవలం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం కాదని, ప్రభుత్వ పాలనను నేరుగా గిరిజన గ్రామాలకు చేరవేసే ప్రజా వేదిక అని పేర్కొన్నారు. గిరిజనులు సమర్పించిన ప్రతి వినతిని మానవీయ దృక్పథంతో పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పురోగతిని నిరంతరం సమీక్షించి లబ్ధిదారులకు సమాచారం అందించాలని సూచించారు. దర్బార్‌లో భూమి, పోడు భూముల హక్కులు, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ రుణాలు, రైతుబంధు, గృహవసతి, ఉపాధి, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, భూమి సమస్యలను రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మారుమూల గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గిరిజన యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్, ఎస్‌డీసీ ఆనంద్ కుమార్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ చందనతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/receipt-of-petitions-in-tribal-durbar-mandates-expeditious-disposal/article-18154

Tags: