అమరవీరులకు నివాళులతో ఆవిర్భావ వేడుకలు

అమరవీరులకు నివాళులతో ఆవిర్భావ వేడుకలు

విశ్వంభర, రాంనగర్ : కెసిఆర్ చేపట్టిన దీక్ష వల్లనే తెలంగాణ సాధ్యమైందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదు రాంనగర్ చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉద్యమకారుల కృషి కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జయసింహ, తెలంగాణ ఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్, శంకర్ ముదిరాజ్, ఇంద్రసేనారెడ్డి, బల్లెకరి రమేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/emergence-celebrations-with-tributes-to-martyrs/article-16152

Tags: