అండర్ బ్రిడ్జి మరమత్తులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి - ఎంపీ బలరాం నాయక్
On
విశ్వంభర, మహబూబాబాద్ : అనంతారం రోడ్డు లోని అండర్ బ్రిడ్జి మరమత్తులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలో రైల్వే 3వ లైన్ పనులు ప్రారంభం కానుండగా అండర్ బ్రిడ్జి మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ దృష్టికి వెళ్లగా వెంటనే స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు గూగులోత్ వంశీ నాయక్ ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాల్ అధికారులను, రైల్వే అధికారులను పిలిపించి అనంతరం రోడ్డులోని అండర్ బ్రిడ్జిని మరమ్మత్తులు చేసి వాహనదారులు వెల్లె విధంగా మరమ్మత్తులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు బయ్యారం పి ఏ సి ఎస్ డైరెక్టర్ జూలకంటి సీతారాం ఉన్నారు.