కొత్తూరులో మెగా హెల్త్ క్యాంపు
విశ్వంభర, కొత్తూరు : తెలంగాణ ప్రభుత్వము 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా సోమవారం షాద్ నగర్ డివిజన్ కొత్తూర్ మండల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మెగా వైద్య ఆరోగ్య శిబిరం న కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెగా వైద్య శిబిరంలో 6 మంది హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషలిస్టులు మన గ్రామంలో ఉన్న అందరికీ 60 రకాల పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. గర్భవతులకు,చిన్నపిల్లలకు,దంత సమస్యలకు, కంటి చూపుకు, జనరల్ గా సంబంధించిన వ్యాధులకు,మరియు మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులకు సంబంధించిన,బీపీ,షుగర్లకు సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చికిత్స చేసి ఫ్రీగా పరీక్షలు చేసి, ఫ్రీగా మందులు అందజేస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మెగా స్పెషలిస్ట్ వైద్యుల క్యాంపును కొత్తూరు మండలంలోని అందరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తెలియచేశారు. ఇవే పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయిస్తే ఒక్కొక్కరికి 4,000 నుండి 5000 రూపాయలు ఖర్చు అవుతుందని, అలాంటిది మన పేదల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఉచితంగా, క్యాంప్ పెట్టి అన్ని ఫ్రీగా చేయిస్తుందని ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ కొత్తూరు ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంపుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మరియు ఓపి పరిశీలించిన తర్వాత డాక్టర్ దీప్తిని ప్రశంసించారు.సోమవారం కొత్తూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 410 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో స్త్రీ వైద్య నిపుణులు 88 మందిని పరిశీలించారు అని, 79 మందికి జనరల్ మెడిసిన్ సార్ తో పరీక్షలు నిర్వహించారని,52 మంది చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించారని,73 మందికి ఆర్థోపెటిక్ డాక్టర్ తో పరీక్షలు నిర్వహించారని, 62 మందికి కంటి పరీక్షలు నిర్వహించరని, 56 మందికి దంత పరీక్షలు నిర్వహించాలని కొత్తూరు డాక్టర్ దీప్తి తెలియజేశారు. మొత్తం ఓపియం 410 లో 40 మందికి కొత్తూరు ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షలు నిర్వహించారని, 210 మందికి బ్లడ్ షాంపూలు కలెక్ట్ చేసి కొండాపూర్ ఆసుపత్రి అని,12 మందికి పాప్ స్మియర్ కలెక్ట్ చేశారని, 64 మందికి ఎన్సీడీ పరీక్షలు నిర్వహించాలని,31 మందికి రిఫరల్ చేశారు అని డాక్టర్ దీప్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడి తాండ సర్పంచ్ గబ్రు, పెంజర్ల సర్పంచ్ ఎర్రోళ్ల జగన్, కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీ,కొత్తూరు ఎంపీడీవో అరుంధతి,డాక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ,డాక్టర్ దీప్తి,డాక్టర్ రాజేష్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగేష్,ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారులు సరిత,ఝాన్సీ, ఉదయ్ కిరణ్,రామ్ నాయక్ , డాక్టర్ నాగమణి,హెల్త్ సూపర్వైజర్ అనసూయ,ఫార్మసిస్ట్ శ్రీనివాస్ రెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్ శివశంకర్, సీనియర్ అసిస్టెంట్ ఝాన్సీ,ఏఎన్ఎంలు, నవాజ్ మరియు ఆశాలు పాల్గొన్నారు.



