బార్ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్‌కు దాఖలు చేసిన టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్
On
విశ్వంభర,హైదరాబాద్ : టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడు తేదీ జనవరి 30 2026 న జరిగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయడానికి సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ బార్ కౌన్సిల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం లో టిపిసిసి లీగల్ సభ్యులు, న్యాయవాదులు, గిరిజన న్యాయవాదులు భారీ సంఖ్యగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యాయవాది గాంధీ నాయక్ మాట్లాడుతూ పొన్నం అశోక్ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేపడతారని, న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తారని, జూనియర్ న్యాయవాదులకు నెలవారీ స్టైఫండ్లు వచ్చే విధంగా కృషి చేస్తారని, న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసిన గాంధీ నాయక్, పొన్నం అశోక్ న్యాయవాదులకు ఎప్పుడూ అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని అందరు న్యాయవాదులను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. మీరంతా కష్టపడి పొన్నం అశోక్‌ని బార్ కౌన్సిల్ చైర్మన్‌గా గెలిపించాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ కోడ్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి కోర్టు న్యాయవాది సత్యనారాయణ, ప్రసాద్, రమేష్ రాజు, హుస్సేన్ రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



