కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సమ్మయ్య
విశ్వంభర , హుస్నాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన తోట సమ్మయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర నాయకులు లక్కిరెడ్డి తిరుమల, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రజినీకర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని సమ్మయ్య పేర్కొన్నారు. తనతో పాటు నియమితులైన జిల్లా కిసాన్ మోర్చా కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.