మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం : కుమార్ ముదిరాజ్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో సభ్యులతో కలిసి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ , ఉపాధ్యక్షుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని , మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమ్మరి రాజు, కోశాధికారి ఏపూరి ప్రభాకర్, సహాయ కార్యదర్శి నవీన్ ముదిరాజ్, మార్కెట్ దుకాణదారులు పాల్గొన్నారు.