ఈ20 అమలును నిలిపివేయాలి: ఆప్ తెలంగాణ

ఈ20 అమలును నిలిపివేయాలి: ఆప్ తెలంగాణ

విశ్వంభర, హైదరాబాదు :  ఈ20 (20 శాతం ఎథనాల్ మిశ్రమ పెట్రోల్) విధానాన్ని అమలు చేసి ప్రజలపై అదనపు భారం మోపవద్దని, కేంద్ర పెట్రోలియం మంత్రి హరిదీప్ సింగ్ పూరిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని కోట్లాది వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేవని, దీనివల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం, మైలేజ్ తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. వాహనాలకు నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎథనాల్ ఉత్పత్తి కోసం చెరకు సాగు, నీటి వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలు, వ్యవసాయం, ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసిన మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఈ20 విధానం భారంగా మారుతుందని అన్నారు. ఈ20 అమలుకు ముందు స్వతంత్ర శాస్త్రీయ అధ్యయన నివేదికలను విడుదల చేయాలని, దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, పాత వాహన యజమానులకు రక్షణ కల్పించాలని, వాహనాలకు నష్టం జరిగితే చట్టబద్ధంగా నష్టపరిహారం ఇవ్వాలని, ఎథనాల్ ఉత్పత్తి ప్రభావాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీలోకి తీసుకురావాలని కోరింది. ఆగస్టు 1న ఉదయం 11.30 గంటలకు ఈ20 అంశంపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెకానిక్‌లు, వాహన యజమానులు, ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని హేమా సుదర్శన్ జిల్లోజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ వింగ్ అధ్యక్షుడు నేరేటి ఆంజనేయులు, రాష్ట్ర నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aap-telangana-should-stop-implementation-of-e20/article-20382

Tags: