ఆగస్టు 4న  చేనేత సహకార సంఘాల అధ్యక్షుల అవగాహన సదస్సు

విశ్వంభర, రామన్నపేట:  తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 4న హైదరాబాద్‌లోని కర్నాటి గార్డెన్స్‌లో నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి, సిరిపురం, బోగారం, తుమ్మలగూడెం, జనంపల్లి, రామన్నపేట గ్రామాల్లో కరపత్రాలను ఆవిష్కరించి అధ్యక్షులను సమావేశానికి ఆహ్వానించారు. 2013 తర్వాత దీర్ఘకాల విరామం అనంతరం సంఘం పోరాటాల ఫలితంగానే 2026లో సహకార సంఘాల ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. నూతన పాలకవర్గ సభ్యులకు సహకార సంఘాల చట్టాలు, సంఘాల బలోపేతం, కార్మికుల సంక్షేమంపై రిటైర్డ్ అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులకు అభినందన సభ నిర్వహించి మెమెంటోలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/an-awareness-conference-of-chairpersons-of-handloom-co-operative-societies-on/article-20365

Tags: