చెరువుగట్టు అగ్నిప్రమాద బాధిత ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం

విశ్వంభర, హైదరాబాద్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పరిసరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహాయం అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు మొత్తం రూ.2,00,000 విలువైన చెక్కులను అందజేశారు. బాధితులైన శ్రీ రంగా శ్రవణ్ కుమార్కు రూ.1,00,000, శ్రీ కర్నాటి ఎల్లయ్యకు రూ.1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న సమాజ సభ్యులకు అండగా నిలవడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన బాధ్యతగా భావిస్తోందన్నారు. అగ్నిప్రమాదంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు సంస్థ తరఫున అందించిన ఈ సహాయం వారికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొండ్లే మల్లికార్జున్, రాష్ట్ర కోశాధికారి శ్రీ రేణిగుంట గణేష్ గుప్తా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఇరుకుల్ల రామకృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ చింతల రవి కుమార్తో పాటు పలువురు మహాసభ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పడం, అవసరమైన సమయంలో సహాయం అందించడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సేవా స్ఫూర్తికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-2-lakh-to-arya-vaishya-families/article-20466

Tags: