ఆకర్షణలకు లోనై మోసపోవద్దు
- : జిల్లా సంక్షేమ అధికారి శిరీష
విశ్వంభర, మహబూబాబాద్: యుక్త వయస్సులో భావోద్వేగాలను నియంత్రించుకుని విద్యపై దృష్టి సారించి జీవిత లక్ష్యాలను సాధించాలని ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష విద్యార్థులకు సూచించారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగాలు, డబ్బు, బహుమతులు వంటి ఆకర్షణీయమైన వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. షీ టీం ఎస్‌ఐ సునంద మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు, తప్పుడు పరిచయాల కారణంగా కొందరు పిల్లలు మానవ అక్రమ రవాణా బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా నివారణపై పోస్టర్లను ఆవిష్కరించి, అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, జీసీడీఓ గాయత్రి, అడ్వకేట్ రాజు కృష్ణ, షీ టీం, మహిళా సాధికారత, సఖి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, కిశోర బాలికలు పాల్గొన్నారు.