బోనాలకు  పకడ్బందీ  ఏర్పాట్లు : పద్మారావు గౌడ్

విశ్వంభర, సికింద్రాబాదు :చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఆగస్టు 9న బోనాలు, 10న రంగం వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సికింద్రాబాదు ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. బోనాల నిర్వహణకు అవసరమైన అదనపు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ గుంటి కృష్ణ, కార్యనిర్వహణాధికారి మహేందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సామాల హేమ, రాసూరి సునీత, తీగుళ్ల కిశోర్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/padma-rao-goud-made-arrangements-to-arm-the-bonas/article-20423

Tags: