భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

  • 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

విశ్వంభర, మహబూబాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్ష పరిస్థితులపై సమీక్షించారు. జిల్లా స్థాయిలో 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జలాశయాలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పాత భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. "జీరో క్యాజువాలిటీస్" లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా, మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కాలువలు, కుంటలను నిరంతరం పర్యవేక్షించాలని, పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి అవసరమైతే ప్రజలను తరలించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో 7995074803 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, డీఆర్వో నాగలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/all-departments-should-be-alert-in-the-wake-of-heavy/article-20438

Tags: