యాపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. పండ్ల కోసం ఎగబడ్డ జనం
- క్షణాల్లో ఖాళీ అయిన యాపిల్ పండ్లు
విశ్వంభర, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులోని ఆపిల్ పండ్ల పెట్టెలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీ పడడం గమనార్హం. కొద్దిసేపటికే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్లలో గణనీయమైన భాగాన్ని ప్రజలు బస్తాలు, సంచులు, ద్విచక్ర వాహనాల్లో తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు