తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
విశ్వంభర, ఇనుగుర్తి: విద్య ,ఉపాధ్యాయ సమస్యలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నిర్వహించనున్న మహా ధర్నాకు భారీగా తరలిరావాలని తపస్ మండల శాఖ అధ్యక్షులు సామల రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్ను గురువారం మండల కేంద్రం ఇనుగుర్తి జడ్పిహెచ్ఎస్ లో ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల విరామ సమయంలో ఇనుగుర్తి ఎం.ఈ.వో వెన్న వెంకట్ రెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల ,పెన్షనర్ల దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న 6 డిఏలు, పిఆర్సి అమలు ,సిపిఎస్ సమస్యపరిష్కారం, 317 జీవో బాధిత ఉపాధ్యాయ సమస్యలు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇతర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్.ఎం అమ్మ యాకయ్య, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు ఉపాధ్యాయులు ప్రభాకర్, కోటేశ్వర్ ,సారంగపాణి ,దీప, స్వాతీ, శైలజ, స్వామి, నిరంజన్, మెహమూద్,వెంకటేశ్వర చారి,వీరన్న తదితరులు పాల్గొన్నారు.