ప్రజల ఆరోగ్యంకై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.  -డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్

విశ్వంభర, చండూరు: చండూరు మున్సిపాలిటీలో గత నాలుగు రోజులుగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మల్లేశం  ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో దోమల మందు పిచికారి చేయించడం జరిగింది. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, పరిసరాలను మాతోపాటు మున్సిపాలిటీ ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామని, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ముఖ్యమని, ప్రజలందరూ సహకరించి పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వర్షాకాలం రీత్యా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా దోమల బారి నుండి మనకు మనం రక్షించుకోవాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు  దశరథ, కౌన్సిలర్లు మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు..

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-pay-special-attention-to-the-health-of-the-people/article-20481

Tags: