ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
- : సామాజిక వేత్త హనీఫ్ అహ్మద్
విశ్వంభర, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ నిరుపేద విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిని ప్రభుత్వం దానంగా కాకుండా హక్కుగా గుర్తించి అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక వేత్త హనీఫ్ అహ్మద్ డిమాండ్ చేశారు. పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం అందరికీ నాణ్యమైన, ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో సాగిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్య, ఉద్యోగాల భర్తీ అంశాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా ప్రైవేట్ కళాశాలలు ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తామని, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా నిలిపివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కోర్సులు పూర్తి చేసిన అనంతరం కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిలిపివేయడం చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్న హనీఫ్ అహ్మద్, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పేద విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షించాలని, తెలంగాణ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.