ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో ఆవిష్కరణ
విశ్వంభర, హైదరాబాదు : ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో, బ్రోచర్‌లను గురువారం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో మహాసభల సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నంగారా ఉత్సవాలు దోహదపడతాయని డా. రామచంద్రనాయక్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు జాటోత్ ఠానూ నాయక్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.