పరిగి మున్సిపాలిటీలో రోడ్డు ఆక్రమణల తొలగింపు

విశ్వంభర,  పరిగి: పట్టణ పరిధిలో శాంతి నగర్  కాలనీలో  తుంకుల్ గడ్డ వెళ్ళే దారిలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను మున్సిపల్ యంత్రాంగం పోలీస్ శాఖ సంయుక్తంగా  బందోబస్తుతో విజయవంతంగా తొలగించారు. ప్రజలకు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలపై స్థానికుల  ఫిర్యాదుల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత, మున్సిపల్ కమిషనర్ కె. మల్లేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పవన్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి  డ్రైవ్‌ను చేపట్టారు. ఈ తొలగింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్థానిక ఎస్.ఐ. మోహన్ కృష్ణ తమ పోలీస్ సిబ్బందితో కలిసి రక్షణ  కల్పించారు. మున్సిపల్ సిబ్బందితో పాటు  ప్రజాప్రతినిధులు  కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అధికారులకు సహకరించారు. మున్సిపల్ లైసెన్స్ లేకుండా అనధికారిక ఆక్రమణలు, వ్యాపారాలు నిర్వహిస్తే  ముందస్తుగా నోటీసులు ఇచ్చి టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/removal-of-road-encroachments-in-parigi-municipality/article-20415

Tags: