డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలి 

విశ్వంభర,  మహేశ్వరం: రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న వర్షపు నీరు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. బడంగ్‌పేట్‌లోని రాఘవేంద్ర కాలనీకి వచ్చే ప్రధాన రహదారిపై ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇదే సమస్య తలెత్తినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రధాన డ్రైనేజీ పైప్‌లైన్‌ను పెద్ద సామర్థ్యంతో ఏర్పాటు చేసి వర్షపు నీరు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కి పలుమార్లు వినతిపత్రాలు అందజేయగా, ఆమె కాలనీని సందర్శించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారని తెలిపారు. అలాగే శంషాబాద్ జోనల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు కూడా పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రధాన డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి కాలనీవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ విన్నపాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు పి. సత్యనారాయణ చారి, వైస్ ప్రెసిడెంట్ ఏ. రవికుమార్ జానారెడ్డి, జనరల్ సెక్రటరీ టి. ప్రసాద్, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, ఆలేటి భరత్ కుమార్ తదితర కాలనీవాసులు చేశారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-permanent-solution-should-be-provided-to-the-drainage-problem/article-20419

Tags: