మునిపంపుల చేనేత సహకార సంఘానికి 70 లక్షల క్యాష్ క్రెడిట్ రుణాన్ని మాఫీ చేయాలి :

  • - వనం వాసుదేవులు

 విశ్వంభర, బషీర్ బాగ్: మునిపంపుల చేనేత సహకార సంఘానికి ఉన్న 70 లక్షల క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని, సంఘం అభివృద్ధికి తోడ్పడాలని ముని పంపుల సహకార సంఘం అధ్యక్షులు వనం వాసుదేవులు విజ్ఞప్తి చేశారు. పాలకుల నిర్లక్ష్యం, ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడంతో 18 లక్షలు ఉన్న క్యాష్ క్రెడిట్ వడ్డీతో కలిపి 70 లక్షలు అయ్యాయని వారు అన్నారు. సంఘానికి నిధులు లేకపోవడంతో ఏమి పని చేయాలనో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం కూర్చోవడానికి కనీసం ఫర్నిచర్ లేదని, మునిపంపుల సంఘ భవనం బీటలు ఏర్పడ్డాయని, తలుపులు కిటికీలు, చెదలు పట్టి అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలని, నూలుపై విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని, అన్ని సంఘాల పారిశ్రామికులకు కూడా లబ్ది పొందే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ ఆధునిక పద్ధతులు మారుతున్న తరుణంలో కార్మికులలో నైపుణ్యం పెంచడానికి వృత్తి శిక్షణ ఏర్పాటు చేయాలని, చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ కల్పించే పద్ధతులను చేపట్టాలని వాసుదేవులు అన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cash-credit-loan-of-70-lakhs-should-be-waived-off/article-20389

Tags: