మిషన్-80 ప్రపంచ రికార్డు ఆగస్టు 9న 

మిషన్-80 ప్రపంచ రికార్డు ఆగస్టు 9న 

విశ్వంభర, హైదరాబాదు : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న మిషన్-80 ప్రపంచ రికార్డు ప్రయత్నం పోస్టర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కరాటే రంగంలో సేవలందిస్తున్న వి. సుధాకర్ చేపట్టనున్న ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 9న ఉదయం 9 గంటలకు నారాయణగూడలోని డా. జి.ఎస్. మెల్కోటే పార్క్‌లో ఈ రికార్డు ప్రయత్నం జరగనుంది. వి. సుధాకర్ 8 నిమిషాల్లో 9 రకాల కరాటే పద్ధతులతో 80 షాబాద్ టైల్స్‌ను బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు సాధించేందుకు ప్రయత్నించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో: హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్, జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి, వి. సుధాకర్, అమృత రెడ్డి పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mission-80-world-record-on-august-9/article-20459

Tags: