జైళ్ల శాఖలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి సన్మానం
విశ్వంభర, జిహెచ్ ఎం సి : పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను గౌరవిస్తూ హైదరాబాద్‌లోని జైళ్ల శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వై. రాజేష్, ఐజీ ప్రిజన్స్ (వెల్ఫేర్), ఎన్. మురళీ బాబు, ఐజీ ప్రిజన్స్ (అడ్మిన్), ఎం. సంపత్, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ (వరంగల్ రేంజ్), డా. డి. శ్రీనివాస్, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ (హైదరాబాద్ రేంజ్), మొహమ్మద్ మక్సూద్, ఇన్‌చార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌తో పాటు శాఖకు చెందిన సీనియర్ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని ఆత్మీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించి, వారు శాఖకు అందించిన నిష్కళంకమైన సేవలు, నిజాయితీ, అంకితభావాన్ని ప్రశంసించారు. వారి సేవలకు గుర్తింపుగా, ప్రతి నెల ఉద్యోగుల వేతనాల నుండి సేకరించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందజేయబడిన చెక్కులను పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందజేశారు.