అంగన్వాడీల్లో వంద శాతం మౌలిక వసతులు కల్పించాలి: మంత్రి సీతక్క

  • గత ఏడాదిలో వేలాది కేంద్రాలకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు
  • అన్ని జిల్లాల్లో చిన్నారులకు పాలు, అల్పాహారం పథకం అమలుకు ఆదేశం

విశ్వంభర, హైదరాబాదు : అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్యకు బలమైన పునాది. రాష్ట్రంలోని ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండటంతో పాటు, చిన్నారులందరికీ పాలు, అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ( సీతక్క )అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ఏడాదిలో 5,938 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్లు, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులకు పాలు, అల్పాహారం పథకాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని, పోషకాహారంపై నమూనా సర్వే నిర్వహించి అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీని వేగవంతం చేయడంతో పాటు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లి ఒడి కేంద్రాలు, దత్తత కేంద్రాల విస్తరణ, బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే కేంద్ర నిధులు లాప్స్ కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించి, అంగన్వాడీ కేంద్రాల పురోగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-sitakka-should-provide-hundred-percent-infrastructure-facilities-in-anganwadis/article-20464

Tags: