ఎంపీడిఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడం, అరుతడి (ప్రత్యామ్నాయ) పంటల సాగును ప్రోత్సహించడంపై అధికారులు చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి మాట్లాడుతూ, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి గ్రామంలో జలసిరి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతు పొలంలో ఫామ్ పాండ్ (పత్తి కుంట), ప్రతి గ్రామానికి ఊట కుంట నిర్మాణం చేపట్టడంతో పాటు, రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని సర్పంచులు మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, మండల ఎంపీడీఓ రాములు, మండల తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీఓ రవూఫ్, ఏపీఓ వెంకన్న, మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్, ఏపీఎం జానీ, అలాగే మండల స్థాయి అధికారులు, మండల పరిధిలోని గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సంఘం అధ్యక్షురాలు, సి.సిలు, ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.