ఎల్‌నినో ప్రభావంపై సీఎంకు నివేదిక
విశ్వంభర, హైదరాబాదు : ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు, భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల పంపిణీ, సూక్ష్మ సేద్యం, పశుగ్రాస భద్రత, తాగునీటి సరఫరా, గ్రామీణ ఉపాధి కల్పనపై నివేదికలో కీలక సిఫార్సులు చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం, వర్షపు నీటి సంరక్షణ, పశుగ్రాస బ్యాంకుల ఏర్పాటు, రైతులకు వాతావరణ ఆధారిత సాంకేతిక సూచనలు అందించాలని కమిటీ సూచించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమని నివేదికలో పేర్కొంది.