గణపతి మండపం తొలగింపు

గణపతి మండపం తొలగింపు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హైదరాబాదు బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన దారిలో రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవి చారి ఏర్పాటు చేసిన 30 అడుగుల గణపతి మండపానికి అనుమతి లేదని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో మండపాన్ని తొలగించారు. మండపం తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రవి చారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/removal-of-ganapati-mandapam/article-20429

Tags: