సీపీఎస్ రద్దు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

Read More వైభవంగా విఠలేశ్వర స్వామి రథోత్సవం

విశ్వంభర , అక్కన్నపేట : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వృత్తి విద్య ఉపాధ్యాయుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఓపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకోగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బోయిన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 1984 నుంచి 1993 వరకు డీఎస్సీ ద్వారా ఎంపికైన వృత్తి విద్య ఉపాధ్యాయులను నోటిఫికేషన్ తేదీని ప్రామాణికంగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57, 58 మెమోలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో సుమారు 400 మంది వృత్తి విద్య ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం అన్యాయమని విమర్శించారు. న్యాయంగా దక్కాల్సిన హక్కు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఉపాధ్యాయులను మరోసారి న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించడం వారి పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఒకే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన కారణంగా ఒకచోట ఓపీఎస్, మరోచోట సీపీఎస్ పరిధిలో ఉండిపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని వెంటనే ఉపసంహరించుకుని, హైకోర్టు తీర్పును అమలు చేసి వృత్తి విద్య ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని అమలు చేసి, ఓపీఎస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని బోయిన శ్రీనివాస్ రెడ్డి కోరారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-government-should-keep-the-promise-of-canceling-cps/article-20425

Tags: