యువతలో పెరుగుతున్న HIV, STD కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన
- HIV, STD వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన.
- 19–20 ఏళ్ల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు అధికమవుతున్నట్లు వెల్లడి..
Dating Apps: డేటింగ్ యాప్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతలో అసురక్షిత లైంగిక సంబంధాలు అధికమవుతున్నాయని, దీంతో HIVతో పాటు లైంగిక సంబంధాల ద్వారా సంక్రమించే వ్యాధులు (STDs) పెరుగుతున్నాయని ఓ గైనకాలజిస్ట్ హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం పరిచయం లేని వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోందని తెలిపారు. ముఖ్యంగా 19 నుంచి 20 ఏళ్ల వయస్సు గల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. లైంగిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక సుఖం కోసం జీవితాలను రిస్క్‌లో పెట్టవద్దని, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.