విద్యార్థుల వివరాలను పగడ్బందీగా నమోదు చేయాలి: జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి

విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల వివరాలను యూ-డైస్ ప్లస్ (UDISE+) పోర్టల్‌లో పగడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి సూచించారు. గుండాల మండల కేంద్రంలోని ఎంఆర్సీలో ఏర్పాటు చేసిన యూ-డైస్ ప్లస్ ప్రత్యేక క్యాంపును ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలోని 17 మండలాల మండల విద్యా వనరుల కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ, జిల్లాలోని 884 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 1.15 లక్షల మంది విద్యార్థుల వివరాలను యూ-డైస్ ప్లస్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో విద్యార్థుల నమోదు, డ్రాప్‌బాక్స్ క్లియరెన్స్, అపార్  నమోదు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ నమోదు, మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం విరించి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 17 మండలాలకు ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు, విరించి సంస్థ ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ రూపాని మహేష్, సీఆర్పీ దేవనబోయిన లింగయ్య, ఎంఐఎస్ కోఆర్డినేటర్ దేవనబోయిన నరేష్, కంప్యూటర్ ఆపరేటర్ అనీఫ్ హజిముద్దీన్, మోడల్ స్కూల్ కంప్యూటర్ ఆపరేటర్లు సంతోష్, మౌనిక, అనిత, పాహిమా, కేజీబీవీ ఉపాధ్యాయులు కౌసల్య, అన్నపూర్ణ, శాంతినికేతన్ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు శోభ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-details-of-the-students-should-be-registered-as-padabandi/article-20409

Tags: