ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ భరో
- :వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు యాదగిరి
విశ్వంభర, మోత్కూర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, ఆగస్టు 10న నిర్వహించే "జైల్ భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం మోత్కూర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రైతు సంఘం మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బొల్లు యాదగిరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను కేంద్రం అనుసరిస్తోందని ఆరోపించారు. రైతులు, కార్మికులు, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు లేబర్ కోడ్ల రద్దు, పంటలకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర, కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయడం, నూతన విద్యుత్ చట్టం రద్దు, స్కీమ్ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ల యాదిరెడ్డి, రాగిభావి ఉపసర్పంచ్ పానుగుల లక్ష్మి, రమేష్, పైళ్ల రాంరెడ్డి, సీఐటీయూ నాయకులు కందుకూరి నర్సింహా, పానుగుల రమేష్, గుండు లక్ష్మి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.