ఉద్యమకారులకు  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 

  • : దామరోజు వీరాచారి

విశ్వంభర, మోత్కూరు: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే జీవో  జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మళ్లీ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడం వల్ల నిజమైన ఉద్యమకారులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఆన్‌లైన్ దరఖాస్తుల పేరుతో ఉద్యమకారులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఉద్యమకారులందరికీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం తాను చేసిన నిరంతర కృషికి ఫలితం కనిపిస్తోందని వీరాచారి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ దామరోజు వీరాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యమకారుల హక్కుల సాధనలో ఆయన మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-assurances-given-to-the-activists-should-be-implemented-immediately/article-20401

Tags: