రైల్వే భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలి

రైల్వే భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలి

  • కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఈటల రాజేందర్ 

విశ్వంభర, న్యూఢిల్లీ :  ఈటల రాజేందర్  నేతృత్వంలోని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను  గురువారం కలిసి తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిల అవసరం అధికంగా ఉందని పేర్కొంటూ, ఇప్పటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాదులో రైళ్ల రాకపోకలు, వేగం పెరగడంతో ప్రజలు పట్టాలు దాటే సమయంలో ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట చిన్న అండర్‌పాస్‌లు, తక్కువ ఎత్తులో ఉన్న రైల్వే మార్గాల వద్ద ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే దేశవ్యాప్తంగా అనేక అండర్‌బ్రిడ్జిల్లో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో అవి వినియోగానికి ఇబ్బందిగా మారుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/permanent-measures-should-be-taken-for-railway-safety/article-20468

Tags: