కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు..
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మురుగునీరు రహదారులపైకి చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే మ్యాన్‌హోళ్లను శుభ్రపరచడంతో పాటు నీరు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.