కస్తూర్బాలో స్పాట్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
- ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలి: స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి
విశ్వంభర, గుండాల: గుండాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆధునిక డార్మిటరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అంకితభావంతో బోధించే ఉపాధ్యాయులు, మెనూ ప్రకారం రుచికరమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు, శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్లు, విద్యార్థినుల హెల్త్ కేర్ రికార్డుల నిర్వహణ, మెరుగైన మౌలిక వసతులు, 24 గంటల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 6వ తరగతిలో 6 సీట్లు, 7వ తరగతిలో 8 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం అగ్రికల్చర్ (క్రాప్ ప్రొడక్షన్) విభాగంలో 18 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మండల పరిధిలోని అర్హత గల విద్యార్థినులు ఆగస్టు 5వ తేదీలోపు సంబంధిత పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌ను నేరుగా సంప్రదించి ప్రవేశం పొందాలని సూచించారు.