19 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
విశ్వంభర, అశోక్‌నగర్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తోందని నిరుద్యోగులు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాదు అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఖాళీలు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి సడలించాలని, మెగా డీఎస్సీతో పాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మాత్రమే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు” అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.