కక్కిరేణి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహూకరణ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కక్కిరేణి గ్రామ వాస్తవ్యులు పారేపల్లి బిక్షపతి తమ తండ్రి చంద్రయ్య జ్ఞాపకార్థంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ద్వారా రూ.50 వేల విలువైన 55 అంగుళాల సాంసంగ్ ఎల్.ఈ.డి 4కె టీవీని బహూకరించడం  అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి డిజిటల్ విద్యా విధానంలో ఇలాంటి ఆధునిక సాంకేతిక పరికరాలు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు.ఈ టీవీ ద్వారా డిజిటల్ పాఠాలు,విద్యా వీడియోలు, సృజనాత్మక అభ్యాస కార్యక్రమాలను విద్యార్థులకు మరింత సమర్థవంతంగా అందించే అవకాశం లభిస్తుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ముందుకు వస్తున్న పారేపల్లి బిక్షపతికి, అలాగే హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలోని దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇదే విధంగా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉప సర్పంచ్ నడిగోటి పాండు, ఉపాధ్యాయులు గణేష్, గోపాల్ రెడ్డి, కృష్ణ, ప్రశాంతి, సంధ్య, పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, ఏ.ఏ.పిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళి కృష్ణ, గ్రామ పెద్దలు, మడూరి సోమేశ్వరరావు, సామాజిక కార్యకర్త వేముల సైదులు, చిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tv-reproduction-for-kakkireni-govt-primary-school/article-20363

Tags: