ఫీజు బకాయిల విడుదలలో జాప్యం తగదు: బీజేవైఎం
విశ్వంభర, చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో గురువారం చేవెళ్లలోని వివేకానంద, శ్రీ చైతన్య కళాశాలలో "ఫీజులు బకాయి–బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అభినయ్ గౌడ్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, బిజెపి చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తిలి అనంతరెడ్డి , కొంచెం శ్రీనివాస్ ఆంజనేయులు గౌడ్ , జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్ , బీజేవైఎం నాయకులు ఇంద్రసేనారెడ్డి, పురుషోత్తం రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ బిజెపి మున్సిపల్ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయశంకర్ గౌడ్ ,పత్తి సత్యనారాయణ, సామ కృష్ణారెడ్డి గాజులగూడం శ్రీనివాస్ రెడీ ,శివ కుమార్ గౌడ్ ఎర్రవల్లి అశోక్, అల్లాడ అభిషేక్ రెడ్డి ,పాగా వెంకటేష్ ,వడ్డే గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిల కారణంగా కళాశాలల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటోందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే అన్ని బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు