నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం
విశ్వంభర, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ మలేరియా దినోత్సవంను నిర్వహిస్తున్నట్టు మహబూబాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ నేడు ఒక ప్రకటన లో తెలిపారు. 2026 సంవత్సరం కు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ''మలేరియా అంతానికి ప్రేరణ ఇప్పుడు మనవల్ల అవుతుంది.. ఇప్పుడు మనం తప్పక చేయాలి'' అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. మలేరియా వ్యాధి ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా ఉందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే సంక్రమణ వ్యాధి. జిల్లాలో మలేరియా కేసులను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం అని తెలిపారు.



