గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ విద్యాసంస్థ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ వేడుకలో డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  ఎఎస్.వి.ఎస్ నారాయణ మూర్తి హాజరై విద్యార్థులను అభినందించారు. అతిథులు మాట్లాడుతూ "ఇంజనీరింగ్ డిగ్రీ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజాభివృద్ధికి సాంకేతికతను ఉపయోగించే బాధ్యత కూడా మీపై ఉంది. కష్టపడి సాధించిన ఈ విజయాన్ని భవిష్యత్తులో మరింత ఎత్తుకు తీసుకెళ్లాలి" అని సూచించారు.ఈ సందర్భంగా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాపర్స్‌ను, వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థులను మెరిట్ అవార్డులు, బంగారు పతకాలతో సత్కరించారు. గురునానక్ కళాశాలల వైస్ ఛైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మరియు అధ్యాపకులు గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు పడిన శ్రమను కొనియాడుతూ, కళాశాల తరపున ప్లేస్‌మెంట్లు, ఉన్నత చదువుల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వేడుకల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో సెషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డా. ఎస్. శ్రీనాథ రెడ్డి (డైరెక్టర్), డా. రిషి సయాల్ (అసోసియేట్ డైరెక్టర్), డా. ఎస్.వి. రంగనాయకులు (డీన్ – పరిశోధన , అభివృద్ధి), డా. కేదార్‌నాథ్ ఏ.డి., విభాగాధిపతులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/graduation-day-celebrations-at-guru-nanak-engineering-college/article-18877

Tags: