అధ్యక్షుడిగా పుట్టపాగ వెంకటస్వామి ఎన్నిక 

విశ్వంభర, నాగర్ కర్నూల్:  నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ వర్కింగ్ జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం సొసైటీ ఎన్నికల అధికారి సి,నారాయణరెడ్డి,యం,సందీప్ ల ఆధ్వర్యంలో సింగిల్ విండో సమావేశ భవనంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. 11 మంది డైరెక్టర్లకు గాను ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కాగా   అధ్యక్షుడిగా పుట్టపాగ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడిగా మునగాల చంద్రశేఖర రావు, ప్రధాన కార్యదర్శిగా కందికొండ మోహన్, ట్రెజరర్ గా సురేష్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా కేఎస్ సురేష్, ఖానాపురం ప్రదీప్, రాజేష్ కుమార్ గౌడ్, గబ్బి సత్యనారాయణ,మహమ్మద్ దర్వేష్, కొండ కింది మాధవరెడ్డి, తిప్పర్తి విజయ్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 25 మంది సొసైటీ సభ్యులకు గాను 20 మంది ఈ ఎన్నికలలో హాజరయ్యారు.
 జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం..
 జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా అందరితో కలిసి ముందుకు వెళ్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పుట్టపాగ వెంకటస్వామి అన్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ గత సొసైటీ ఆధ్వర్యంలో 80 శాతం పనులు ముందుకు తీసుకొని వెళ్లారని కొత్తగా ఏర్పడ్డ కమిటీ అందరి సహకారంతో ముందుకు వెళ్లి జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన నాగర్ కర్నూల్ వర్కింగ్ జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు పుట్టపాక వెంకటస్వామి తోపాటు నూతన కార్యవర్గ సభ్యులను తాజా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో సొసైటీ సభ్యులు శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ , గత సొసైటీ  సేవలను సొసైటీ సభ్యులు  కొనియాడారు. ప్రధానంగా సొసైటీకి స్థలాన్ని సాధించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను 80% పూర్తి చేయడం జరిగిందని, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు సేవలు అందించిన అహ్మదుల్లా ఖాన్, ప్రధాన కార్యదర్శి దినకర్ రావు, జెమిని సురేష్, సురేష్ రావు, సొసైటీ సభ్యులను, జెర్నలిస్టుల సంక్షేమం కోసం సీనియర్ జర్నలిస్టుల సహకారం పై ప్రత్యేకంగా అభినందిస్తూ వారినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతూ వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు సాధించే విధంగా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు అభినందించారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/election-of-puttapaga-venkataswamy-as-president/article-18897

Tags: