పార్టీని మరింత బలోపేతం చేయాలి
- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
విశ్వంభర. మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండలం బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిర్వహించారు. కందుకూరు మండలంలో బిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటినుంచే చురుకుగా పనిచేసి పార్టీ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ కందుకూరు మండల అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,మండల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



