గ్రామాల్లో ఫాగింగ్
On
విశ్వంభర,ఇనుగుర్తి: గ్రామాలలో విపరీతంగా విజృంభిస్తున్న దోమల నివారణ కోసం ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు దోమల నివారణ మందును ఫాగింగ్ చేయిస్తున్నారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య సూచనల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ పై దోమల నివారణ మందును శనివారం సాయంత్రం వీధులలో పిచికారి చేశారు. ఈ సందర్భంగా సర్పంచి సుజాత యాకయ్య మాట్లాడుతూ దోమలతో గ్రామస్తుల ఆరోగ్యానికి ఇబ్బంది పడవద్దనే దోమల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండలంలోని అయ్యగారి పల్లి గ్రామంలో సైతం ఆ గ్రామ సర్పంచి మలిశెట్టి శోభన్ ఫాగింగ్ ప్రారంభించారు.



