ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

విశ్వంభర,మహబూబాబాద్: ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షులు డా.కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు జటోతు రామచంద్రనాయక్ కు వినతి పత్రం అందజేశారు.  శనివారం విప్ ను కలిసి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా డా. కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా జీతాలు సరైన సమయానికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1700 మంది ఎన్హెచ్ఎం విభాగంలో పనిచేస్తున్నారని,జీవో 1195ని ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఆదివారం బాలాజీ గార్డెన్ లో జరిగే ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రావాలని రామచంద్రనాయక్ను ఆహ్వానించినట్లు తెలిపారు.

Tags: