కేజీబీవీలో ఇంటర్ హాజరు శాతం పెంచాలి 

కేజీబీవీలో ఇంటర్ హాజరు శాతం పెంచాలి 

  •  జి ఈ సి ఓ యద్దనపూడి గాయత్రి 

విశ్వంభర, నెల్లికుదురు: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో  విద్యార్థినుల హాజరు శాతం పెంచాలని మహబూబాబాద్ జిఈసిఓ యద్దనపూడి గాయత్రి ఆదేశించారు. జిల్లాలోని నెల్లుకుదురు కేజీబీవీని సోమవారం ఉదయం విద్యార్థినుల అల్పాహారం సమయంలో ఆమె ఆకస్మికతనిఖీ చేసి విద్యార్థుల తో పాటు కూర్చుని అల్పాహారం చేశారు. అనంతరం పీజీ, సిఆర్టిలను, సి ఆర్టిలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినులకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కేజీబీవీలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని, మండలంలో 10వ,తరగతి పాస్ అయిన విద్యార్థుల సమాచారం తీసుకొని వారిని  కేజీబీవీ విద్యాలయంలో ఇంటర్లో లో చేరే విధంగా మోటివేషన్ చేయాలని సూచించారు. ఇంచార్జి ఎస్ఓ,  సిఆర్టిలు, పిజిసిఆర్టి లు  విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని జి ఈ సి ఓ  సూచించారు.   పాఠశాలలో వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థుల హాజరు, పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ఆరో తరగతి విద్యార్థులకు గణితము,సైన్స్ పాఠాలు బోధించారు. ప్రతిరోజు విద్యార్థుల మెనూ తప్పకుండా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఓ రమాదేవి, పీజీ సిఆర్టి లు, సిఆర్ టిలు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inter-attendance-percentage-should-be-increased-in-kgbv/article-17437

Tags: