రఘునందన్ రావుకు ముదిరాజులపై కోపం ఎందుకో చెప్పాలి

రఘునందన్ రావుకు ముదిరాజులపై కోపం ఎందుకో చెప్పాలి

  • టీఎంపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి  గద్దగూటి మహేందర్ ముదిరాజ్ 

విశ్వంభర, పటాన్ చెరువు : పటాన్ చెరువు  నియోజకవర్గంలోని  ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బీసీ బిడ్డ నీలం కవిత మధు ముదిరాజ్ కౌన్సిలర్గా  గెలిచిన అభ్యర్థి  ఎక్కడ చైర్మన్ ఎన్నిక అవుతుందా అని ఒక్క కౌన్సిలర్ బిజెపి గెలవలేని  సందర్భంలో ఎంపీ  రఘునందన్ రావు బిసి ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేయడం సరికాదని  టీఎంపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి   గద్దగూటి మహేందర్ ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ,  ఎంపీ రఘునందన్ రావు ఒకేసారి వెళ్లి బిసి ముదిరాజ్ బిడ్డకు చైర్మన్ పదవి దకొద్దని, ఎక్స్ అపీసియా ఓటు వేయడం వేశారని అన్నారు.  బీసీ ఓట్లతో   గెలిచిన ప్రజా ప్రతినిధి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.  రఘునందన్ రావుకు ముదిరాజులపై కోపం ఎందుకో చెప్పాలని  కోరారు. బీసీ హక్కుల పర్యరక్షణ కోసం  పోరాడుతామని,  ఇప్పటికైనా బిసి ముదిరాజుల జోలికి వస్తే  పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తగిన బుద్ధి చెప్తామని మహేందర్ ముదిరాజ్ తెలిపారు,

Tags: