ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా :సర్పంచ్ గోపాల్ రెడ్డి

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా :సర్పంచ్ గోపాల్ రెడ్డి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు నీర్నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి తెలిపారు. నీర్నెముల గ్రామంలో జరిగిన గ్రామసభలో సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో రెండు సీసీ రోడ్లు పూర్తి చేసి, స్త్రీశక్తి భవనం నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు చేసి, తడి–పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. నీటి ట్యాంకులను శుభ్రపరచడం, డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి చెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మిరియాల లక్ష్మి, ఉప సర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు నెంబర్లు చినపాక రమేష్, శానకొండ రవళి, వీఆర్ఏ చల్ల ముత్యాలు, పల్లెర్ల రవీందర్ రెడ్డి, ఆవుల లక్ష్మీనారాయణ, ఏబూసి బిక్షం,  ముత్యాల పర్వతాలు, సుర్వి యాదయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, నోముల యాదయ్య, చిప్పలపల్లి పద్మ, నోముల లలిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: