చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. - సీనియర్ సివిల్ జడ్జ్ శాలిని .

ముగిసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ శిబిరం .

చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. - సీనియర్ సివిల్ జడ్జ్ శాలిని .

విశ్వంభర, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో  50 మంది పారా లీగల్ వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణ తరగతులను  నిర్వహించారు . ఈ సందర్భంగా  కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్జ్ శాలిని మాట్లాడుతూ చట్టాలను ,  ప్రజల్లోకి , గ్రామాల్లోకి,  తీసుకెళ్లాలని, వారిలో న్యాయ చైతన్యం కలిగించాలని చట్టాలపై అవగాహన లేని ప్రతి వ్యక్తి కూడా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించే విధంగా వారిని ప్రోత్సహించాలని ,  అందువల్ల వారిలో న్యాయ చైతన్యం పెరుగుతుందని  అన్నారు .శిక్షణ తరగతుల నిర్వహణలో భాగంగా ఈరోజు సిడబ్ల్యుసి చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి ,  ప్రభుత్వ న్యాయవాది తోరణాల నగేష్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అయిన దాసరి నాగేశ్వరరావు, న్యాయవాదులు కమలకుమార్, విశ్వ,  మొదలైన వారు వాలంటీర్లకు వివిధ రకాలైనటువంటి చట్టాల పైన అవగాహన కలిగించడం జరిగింది.  ఈ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా వాలంటీర్లకు, పబ్లిసిటీ మెటీరియల్ పంచి  చట్టాల పైన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు .
 

Tags:  

Advertisement

LatestNews